విశాఖపట్నం: సింహాచలంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన వైభవంగా జరిగింది. విశాఖకు చెందిన శ్రీ మీనాక్షి కూచిపూడి డాన్స్ అసోసియేషన్ వారు అందించిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సనాతన సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.