గిద్దలూరు: కొమరోలు మండలంలో జరిగిన సర్వసభ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ప్రజల సమస్యలపై చర్చించారు. తాగునీటి సమస్యతోపాటు రోడ్ల సమస్యలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అధికారులు కూడా అందుకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.