మార్కాపురం: పదో తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించారని వెల్లడించిన జడ్పి హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాల స్థాయిలో అత్యధికంగా 578 మార్కులు సాధించిన షంషీర్ ను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. మొత్తం 253 మంది విద్యార్థులు హాజరు కాగా 219 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 500 మార్కులపైగా 34 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. 170 మంది విద్యార్థులు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులు అయ్యారన్నారు.