దర్శి: దర్శి నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం రెండు గ్రామాలలో నింపిన విషాదం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం రెండు గ్రామాలను విషాదంలో నింపింది. ముండ్లమూరు మండలం పసుపుగల్లు దర్శి మండలం సామంతపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పిడుగుపాటుకు గురై మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. సామంతపూడి గ్రామానికి చెందిన మల్లికార్జున పశువులకు మేత వేయడానికి వెళ్ళిన సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పసుపు గల్లులో గొర్రెలు మేపడానికి వెళ్ళిన శివకృష్ణ పిడుగుపాటుకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.