మార్కాపురం: కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో జిల్లా కలెక్టర్ కు అందజేశారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులు వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జేసి శ్రీనివాసులు ఆర్డీవో ప్రభాకర్ పాల్గొన్నారు