గిద్దలూరు: రాజ్యసభలో అమరావతి బిల్లుకు ఆముదముద్ర లభించడంతో గిద్దలూరులో సంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు
రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతి బిల్లు ఆమోదముద్ర లభించడంతో మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఎన్డీఏ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తనయుడు దివ్యేష్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. టిడిపి నాయకులు దివ్యేష్ రెడ్డి మాట్లాడుతూ, ఐదు సంవత్సరాలుగా రాజధాని రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని నేడు ఆముదముద్ర లభించడం ఆనందంగా ఉందని అన్నారు. డబల్ ఇంజన్ సర్కారు సారధ్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.