మార్కాపురం: జిల్లా కేంద్రంలో పీర్లు ఊరేగింపు సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలి చెలరేగిన మంటలు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పేర్ల ఊరేగింపు సమయంలో విద్యుత్ వైర్లకు తాకడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.