దర్శి: దరిశి మండల నూతన ఇన్చార్జిగా ఎమ్మార్వో రమణారావు బాధ్యతలు స్వీకరణ
ప్రకాశం జిల్లా దర్శి మండల నూతన ఇన్చార్జి ఎమ్మార్వో గా రమణారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మండలంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు తెలియజేయాలని కోరారు.