గిద్దలూరు: వయోభారంతో గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ ఐవి రెడ్డి తండ్రి వైసిపి నేత పుల్లారెడ్డి మృతి, రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మాజీ వైసీపీ ఇన్ ఛార్జ్ ప్రస్తుత వైసిపి నేత ఐ.వి రెడ్డి తండ్రి ఇల్లూరి పుల్లారెడ్డి (86) వయోభారంతో సోమవారం మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పుల్లారెడ్డి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించి ఆయన మృతి చెందారు. పలువురు నేతలు కార్యకర్తలు పుల్లారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. పుల్లారెడ్డి అంత్యక్రియలను ఈనెల మే26న ఉదయం 11 గంటలకు ఐవీ రెడ్డి స్వగ్రామమైన గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో నిర్వహిస్తామని ఐవీ రెడ్డి తెలిపారు.