యర్రగొండపాలెం: కంభంపాడు గ్రామ శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై దాడి నిర్వహించిన ఎస్సై సైదు బాబు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కంభంపాడు గ్రామ శివారు ప్రాంతంలోని పొలాలలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సైదు బాబు తెలిపారు. వారి వద్ద ఉన్న 3200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై హెచ్చరించారు.