మార్కాపురం: జిల్లా కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీలో డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత: జిల్లా కలెక్టర్ విజయ సునీత
డెంగ్యూ నివారణ మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో ఆమె ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి కరపత్రాలు ఆవిష్కరించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారానికి ఒకసారి నీటి నిలువలు అన్నింటిని ఖాళీ చేసి శుభ్రం చేయాలని తెలిపారు. పూల కుండీలు, కూలర్లు, టైర్లు వంటి చోట్ల నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.