కళ్యాణదుర్గం: కుందుర్పిలో అత్యంత ఘనంగా కుందుర్పమ్మ గిరి ప్రదక్షణ మహోత్సవం
కుందుర్ప మండల కేంద్రంలో శుక్రవారం భక్తుల ఇలవేల్పు కుందుర్పమ్మ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలి వచ్చారు. కుందుర్పమ్మ చల్లగా చూడు తల్లీ అంటూ భక్తులు మొక్కుకున్నారు. కుందుర్పి మండలం నుంచి కాకుండా చుట్టుపక్కల మండలాల భక్తులు భారీగా తరలివచ్చి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గిరి ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందని, సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం.