కొండపి: మరిపూడి మండలంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకల నేపథ్యంలో ఉద్రిక్తత, మాజీ మంత్రి విగ్ర ఆవిష్కరణను అడ్డుకున్న స్థానికులు
మర్రిపూడి మండలంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయల సముదాయంలో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించేందుకు స్థానిక టిడిపి కార్యకర్తలు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామంలోకి మాజీమంత్రి రానికుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోగా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఆదిములకు సురేష్ గతంలో విగ్రహ ఏర్పాటుకు నిధులు ఇచ్చినట్లుగా కార్యకర్తలు చెబుతున్నారు.