మార్కాపురం: చెన్నకేశవ స్వామి ఆలయం అభివృద్ధికి కోటి 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపిన ఈ ఓ శ్రీనివాసరెడ్డి
మార్కాపురంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో గత ప్రభుత్వంలో నాలుగు గోపురాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అవి అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చొరవతో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు చేసేందుకు కోటి 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో టెండర్లు వేసి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను ప్రారంభిస్తామన్నారు