రాయదుర్గం: తుంగభద్ర డ్యాం కు 28,351 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు అంతర రాష్ట్ర జల ప్రాజెక్టు తుంగభద్ర రిజర్వాయర్‌కు వరద ప్రారంభమైంది. గురువారం ఉదయానికి 28,351 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.4 టీఎంసీలకు నీరు చేరింది. దీంతో అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీ ఆయకట్టు రైతుల్లో సాగుపై ఆశలు చిగురించాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ సీజన్‌లో నీరందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.