రాయదుర్గం: డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు కొనియాడిన మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా" అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని భారతీయ జనతా పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. ముఖర్జీ గారి దేశభక్తి, జాతీయ సమైక్యత పట్ల అచంచల నిబద్ధతను గుర్తుచేసుకున్నారు. దేశ సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం యావత్ భారతానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జివి నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు హరిత, రాయదుర్గం రూరల్ మండల అధ్యక్షులు నాగరాజ