యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం చౌటపచర్ల గ్రామంలో ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో ప్రభాకర్
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం చౌటపచర్ల గ్రామంలో ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మార్వో మల్లికార్జున నాయుడు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఆర్డీవో ప్రభాకర్ పాల్గొన్నారు. ఆర్డిఓ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు