రాయదుర్గం: రైతు పత్తిని దొంగిలించిన నలుగురిని అరెస్టు చేసిన బొమ్మనహాళ్ పోలీసులు
బొమ్మనహాళ్‌లో రైతు పత్తి దొంగిలించిన నలుగురిని పోలీసులు రెండు రోజుల్లో అరెస్టు చేశారు. ఉంతకల్లు గ్రామ రైతు హనుమంతరాయకు చెందిన రూ.50 వేలు విలువైన 5 క్వింటాళ్ల పత్తి చోరీకి గురైంది. బాదితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నెమకల్లు క్రాస్ వద్ద వారిని అరెస్టు చేశారు. వన్నూరుస్వామి, నవీన్, నితిన్, హరి అరెస్టైన వారిలో ఉన్నట్టు సిఐ వెంకటరమణ తెలిపారు. వారి వద్ద రూ.44 వేల నగదు, టాటా ఏస్ వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్ఐ నబీరసూల్ పాల్గొన్నారు.