మార్కాపురం: కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వెల్లడించిన బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి రామచంద్రారెడ్డి
ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్లు నిధులు ఇచ్చినట్లుగా బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్ర రెడ్డి అన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షులు కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమతో కలిపి మార్కాపురం జిల్లా హార్టికల్చర్ హబ్ గా మారబోతుందన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయమని 13,175 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. జిల్లా ఏర్పాటు ఒక కన్ను అయితే ప్రాజెక్టు రెండవ కన్నాని ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చిన వరమన్నారు.