గిద్దలూరు: గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో అదృశ్యమైన వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 21వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరసింహులు ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఈనెల 23వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఊరికి దూరంగా పొలాలలో నరసింహులు మృతి చెందిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చనిపోయి మూడు రోజుల వరకు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.