గిద్దలూరు: కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ శివకృష్ణారెడ్డి
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఎస్ఐ శివకృష్ణారెడ్డి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సు కండిషన్ బస్సు డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు బస్సులో ఉన్న రక్షణ పరికరాలు వంటివి పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు. 100 కిలోమీటర్లకు ఒకసారి కొంతసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలని ఎస్ఐ శివకృష్ణారెడ్డి బస్సు డ్రైవర్లకు సూచించారు.