గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గం లో ఈనెల 27 28వ తేదీలలో జరిగే డిజిటల్ మహానాడు విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ఈనెల 27, 28వ తేదీలలో గిద్దలూరు నియోజకవర్గం లోని అన్ని మండలాలలో జరిగే క్లస్టర్ల స్థాయి డిజిటల్ మహానాడుని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గిద్దలూరు టిడిపి కార్యాలయం నుంచి కార్యకర్తలకు ఓ ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే... దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంధనం పొదుపు చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు నెల్లూరులో జరగవలసిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. డిజిటల్ విధానంలో సాగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆన్లైన్లో ప్రసంగిస్తారని తెలిపారు.