మార్కాపురం: భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికెత్ లో నియమకాలు చేపట్టిన రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్ వలి
మార్కాపురం ప్రెస్ క్లబ్ లో భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికెత్ రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్ వలి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా షేక్ సుభాని ని నియమించారు. వారికి రాష్ట్ర అధ్యక్షులు నియామక పత్రాలు అందజేశారు. రైతుల కోసం పోరాటం చేసి వారి హక్కుల కోసం నిలబడే వారికి ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.