గిద్దలూరు: గిద్దలూరు మండలం లో సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేసిన అధికారులు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గిద్దలూరు మండలంలో ఈనెల 27వ తేదీన పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, కోఆర్డినేటర్ వెంకటేష్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హెలీ ప్యాడ్ సభా ప్రాంగణాలను పోలీసులు డాగ్స్ స్క్వాడ్ తో జల్లెడ పట్టారు. సంజీవిని ఆసుపత్రి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నారని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు.