మార్కాపురం: ఇడుపూరు గ్రామంలో తమ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కలెక్టర్ కు వినతి
మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలో తమ పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని ఇతరుల ఆక్రమించుకొని ఆన్లైన్ చేసుకున్నారని బాధితులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్రమ ఆన్లైన్ తొలగించాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. సర్వే నెంబర్లు 954-2, 955, 957-1 లలో ఉన్న భూమిని సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని అన్నారు. అక్రమ ఆన్లైన్ తొలగించి తమ పేర్లను నమోదు చేయాలని కోరారు