కొత్తగూడెం: భద్రాచలం ఐటీడీఏలో డ్రైవర్ల ఆధ్వర్యంలో ఘనంగా వాహన పూజలు
దసరా పండుగ సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని డ్రైవర్లు తమ వాహనాలకు సాంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. క్షేమంగా విధులను నిర్వహించాలని, ప్రమాదాలు జరగకుండా దుర్గామాత కాపాడాలని కోరుతూ ఈ పూజలు చేపట్టినట్లు డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు రాఘవులు తెలిపారు.