రాయదుర్గం: వర్షానికి వాగు ఉదృతి, వర్షంలో చిక్కుకున్న జె.వెంకటాంపల్లి గ్రామస్తులు
వర్షానికి గుమ్మగట్ట మండలం జె.వెంకటాంపల్లి వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటలేక ఇరువైపులా వాహనాలు, ప్రజలు నిలిచిపోయారు. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి వాగు ఉప్పొంగడంతో ప్రజలు వర్షంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏడాది క్రితం వర్షానికి బ్రిడ్జి కొట్టుకుపోగా ఇప్పటికీ కొత్తది నిర్మించలేదు. వర్షం వస్తే తిప్పలు తప్పడం లేదు. 'ఎమ్మెల్యే సార్ మా గోడు వినండి, బ్రిడ్జి ఏర్పాటు చేయండి' అని గ్రామస్తులు వేడుకున్నారు.