తాడిపత్రి: సీఎం పర్యటనకు 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తాం: యాడికిలో జిల్లా ఎస్పీ జగదీష్
యాడికి లో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా యాడికి టీటీడీ కళ్యాణ మండపంలో పోలీసులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. వేములపాడు మార్గంలో మాత్రమే ఆంక్షలు ఉంటాయన్నారు. ఇతర మార్గాల్లో ఎలాంటి ఆంక్షలు విధించడం లేదన్నారు.