గిద్దలూరు: గిద్దలూరు అర్బన్ కాలనీలో కుటుంబ కలహాలతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ కాలనీకి చెందిన పోలయ్య అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ కలహాలతో పోలయ్య పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు. మృతి చెందే ముందు పోలీసులకు పోలయ్య తన చావుకి భార్య కుమారుడే కారణమని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి చనిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మంగళవారం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ముతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.