రాయదుర్గం: కోటి ఆశలు కొత్త కలలతో బడిబాట పట్టిన విద్యార్థులు, కొత్త శోభను సంతరించుకున్న పాఠశాలు
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కోటి ఆశలు, కొత్త కలతో రాయదుర్గం మండలంలోని విద్యార్థులు శుక్రవారం సందడిగా బడిబాట పట్టారు. పిల్లల సందడితో మండలంలో 72 ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ ఏడాది రాయదుర్గం మండలంలో మొత్తం 14,248 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. మెదటి రోజు 40 శాతం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలతో నిర్వహించిన ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ మంచి ఫలితాలు ఇచ్చింది. ఫలితంగా అనేకమంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల నుంచి పిల్లలను తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు.