గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో పోలయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో పోలయ్య అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య యత్నం చేశాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరువైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పోలయ్య తన భార్య తన కొడుకు హంతకులు అని తన చావుకు వాళ్లే కారణమని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.