కొండపి: సింగరాయకొండ కాటికాపర్ల కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం
యాచక వృత్తిని వదిలి చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని సింగరాయకొండ సిఐ శ్రీహరి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని కాటికాపర్ల కాలనీలో సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి ప్రతి ఇంటిని పరిశీలించి పత్రాలు సరిలేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకరమైన ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. కాటికాపర్లు కులవృత్తినే నమ్ముకొని విలువలు కోల్పోతూ యాచించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. తమ బిడ్డలను చక్కగా చదివించుకొని ఉన్నత స్థాయికి ఎదగడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.