గిద్దలూరు: రాచర్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో జలహారతి జలధార కార్యక్రమం వివరాలను వెల్లడించిన ఏవో మహాలక్ష్మి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో అమలుపరిచే జల హారతి జలధర కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 38 వర్కులు చేయడం జరిగిందని రాచర్ల ఉపాధి హామీ పథకం ఏవో మహాలక్ష్మి తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.3.68 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాచర్ల మండలంలోని 14 పంచాయతీలలో ఉపాధి హామీ పథకంలో భాగంగా వంద రోజులలో చెరువులలో కాలువలలో కూడికలు తీసి రాబోయే వర్షాకాలనికి నీరంతా నిలువ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం 100 రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేయవలసి ఉంటుందని ఏవో మహాలక్ష్మి వెల్లడించారు.