గిద్దలూరు: గిద్దలూరులో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని అర్జీలను వెంటనే పరిష్కరించారు. క్లిష్టతరమైన సమస్యలను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అర్జీదారులకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.