గిద్దలూరు: రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావుని వెలిగండ్లకు బదిలీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మొత్తం నలుగురు ఎస్సైలు బదిలీ
మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు బదిలీ అయ్యారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లాలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఎస్సై కోటేశ్వరరావుని వెలిగండ్ల మండలానికి బదిలీ చేశారు. వెలిగండ్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కృష్ణ పావనిని విఆర్ కు పంపారు. తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడుని విఆర్ కు పంపగా ఆయన స్థానంలో శివ బసవరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు.