యర్రగొండపాలెం: యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరి దేవి ఆలయ సమీపంలో జూన్ 18వ తేదీ జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. ముందుగా ఉమ్మడి ఆలయాలను సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జెసి శ్రీనివాసులు మండల అధికారులు పాల్గొన్నారు