గిద్దలూరు: రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో గుండెపోటుతో ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలి లింగయ్య మృతి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలి లింగయ్య గుండెపోటుతో మృతి చెందాడు. ఒక్కసారిగా కుప్పకూలిన లింగయ్యను మిగతా కూలీలతో పాటు అక్కడ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఉపాధి హామీ పథకం ఏవో మహాలక్ష్మి మాట్లాడుతూ లింగయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయాన్ని అందిస్తామని ఆమె తెలిపారు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.