మార్కాపురం: జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా ఊరేగింపు
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలకి ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పగలు ఉత్సవంలో భాగంగా నాలుగు మాడవీధులలో చెన్నకేశవ స్వామిని ఘనంగా ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు