మార్కాపురం: జిల్లా కేంద్రంలో గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రహించడంతో రక్షణ చర్యలు చేపట్టిన పోలీసులు
మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. పెద్ద నాగులవరం నుండి మార్కాపురానికి పనుల నిమిత్తం గ్రామస్తులు గుండ్లకమ్మ నదిపై రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గతంలో వాగును దాటుతూ పనిచేసుకుంటున్న కార్మికులు ఎంతోమంది చనిపోయిన విషయం తెలిసినదే. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గుండ్లకమ్మ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. పనులకు వెళ్లేవారు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి మేరకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.