తాడిపత్రి: యాడికి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్
యాడికి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. జిల్లా అధికారులతో కలిసి ఆయన ఆసుపత్రిని తనిఖీ చేశారు. జిల్లాలోని యాడికి ప్రాథమిక కేంద్రాన్ని మోడల్ గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా కలెక్టర్ తనిఖీ, పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.