కొండపి: టంగుటూరు మండలంలో ఇనుము ఖనిజ తవ్వకాలు నిలిపివేయాలని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన గ్రామస్తులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు, ఎర్రజర్ల, కందులూరు పరిసర ప్రాంతాలలో ఇనుప ఖనిజాల తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద గ్రామస్తులు నిరసన తెలిపి తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. తవ్వకాలు ఆపకపోతే నిరసన కార్యక్రమాలు తీవ్రం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఖనిజ తవ్వకాల వల్ల కాలుష్యం పెరిగి స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.