రాయదుర్గం: మల్కాపురంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన సిఐ
రాయదుర్గం మండలం మల్కాపురంలో ప్రజలకు రోడ్డు భద్రతపై సిఐ జయనాయక్ అవగాహన కల్పించారు. మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఆటోలు, బైక్ లపై ప్రయాణించే సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు వివరించారు. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయంలో సైబర్ మోసాగాళ్ళ వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.