మార్కాపురం: పట్టాభి రామస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దంపతులు
మార్కాపురం పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో పట్టాభి రామస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భక్తుల సంఖ్యలో పాల్గొన్నారు.