దర్శి: టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టిడిపి నాయకులకు వివరించారు. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయం నందు టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన తీరును వివరించారు. ప్రభుత్వం నెరవేర్చిన ఎన్నికల హామీలను ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.