మార్కాపురం: మార్కాపురం పట్టణ ఎస్ఐగా విశ్వనాథరెడ్డి బాధ్యతలు స్వీకరణ
మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా విశ్వనాథరెడ్డి ని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నియమించారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై సైదుబాబు పెద్దారవీడు పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆస్థానంలో నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా సేవలందించిన విశ్వనాథరెడ్డిని మార్కాపురం ఎస్ఐగా బదిలీ చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐకి చేసిన సిబ్బంది ఘన స్వాగతం పలికారు