రాయదుర్గం: నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు
నిబంధనలు పాటించని ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని AISF జిల్లా కోశాధికారి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం రాయదుర్గం MEO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని MEO ఇర్షాద్ కు అందజేశారు. ముందస్తుగా అడ్మిషన్లు, పాఠ్య పుస్తకాల విక్రయాలపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా తనిఖీలు చేపట్టాలని కోరారు.