యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో జనావాసాల మధ్యకు వచ్చిన నెమలి
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో అడవిలో నుంచి ఓ నెమలి జనావాసాల్లోకి వచ్చింది. దీంతో 20 కోతులు ఆ నెమలిపై దాడికి ప్రయత్నించాయి. గ్రామ ప్రజలు ఆ కోతుల నుంచి నెమలిని రక్షించారు. అనంతరం ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జున కు అప్పగించారు. గాయపడిన నెమలికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి వైద్యం అందించి అడవిలో వదిలిపెడతానని మల్లికార్జున అన్నారు.