దర్శి: కురిచేడు మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కల్పించినట్లు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృష్ణారెడ్డి
Darsi, Prakasam | Jun 18, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో విఫలమైందన్నారు. గతంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన పప్పుల మిల్లును తిరిగి ప్రారంభించడంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు