మార్కాపురం: రాయవరం గ్రామంలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోని సచివాలయ భవనం
మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో గత ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా సచివాలయ భవన నిర్మాణం చేపట్టారు. కానీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో నిరుపయోగంగా మారిపోయింది. అదేవిధంగా పక్కనే రైతు సేవా కేంద్రం భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి భవన నిర్మాణాలు చేపట్టారు. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు పలు విమర్శలు చేశారు