గిద్దలూరు: గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డివాములు దగ్ధం, రూ.2 లక్షలు ఆర్థిక నష్టం
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. పద్మావతి, రంగస్వామి అనే రైతులకు చెందిన వరిగడ్డి, సొప్ప, శనగపొట్టు ప్రమాదవశాత్తు కాలిపోయింది. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను వ్యాప్తి చెందకుండా ఆర్పివేశారు. ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యం కావడంతో గడ్డివాములు పూర్తిగా కాలిపోయినట్లు రైతులు వాపోయారు. దాదాపు రూ.2 లక్షలు ఆర్థికంగా నష్టపోయామని రైతులు వెల్లడించారు.